Mega Power Star Ram Charan unveils thrilling Teaser for ZEE5 Original ‘Puli-Meka’

0
180
మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ రిలీజ్ చేసిన జీ 5, కోన ఫిల్మ్ కార్పొరేష‌న్ బ్యాన‌ర్ కాంబోలో రూపొందుతోన్న సస్పెన్స్ థ్రిల్లింగ్ ఒరిజిన‌ల్ ‘పులి మేక’ టీజర్.
 
ఫిబ్ర‌వ‌రి 24 నుంచి జీ 5లో ‘పులి మేక’ స్ట్రీమింగ్ – ప్ర‌ధాన పాత్ర‌ల్లో లావ‌ణ్య త్రిపాఠి, ఆది సాయికుమార్‌, సిరి హ‌న్మంత్

సాధార‌ణంగా నేరాలు జ‌రిగిన‌ప్పుడు ప్ర‌జ‌లు పోలీసుల‌ను ఆశ్ర‌యిస్తారు. మ‌రి వారినే ఓ హంత‌కుడు టార్గెట్ చేసి చంపుతుంటే పోలీసులు ఏం చేస్తారు?  భ‌యంక‌ర‌మైన ప‌నులు చేసే వ్య‌క్తిని మృగం అంటుంటాం. మృగంలాంటి వేషంతో ఓ వ్య‌క్తి అలాంటి ప‌నులు చేస్తే దాన్నెమ‌నాలి. అలాంటి మృగంలాంటి మ‌నిషి సిటీలో వ‌రుస హ‌త్య‌ల‌ను చేస్తుంటాడు. అయితే అత‌ని టార్గెట్ సాధార‌ణ ప్ర‌జ‌లు మాత్రం కాదు.. ఏకంగా పోలీసులే. త‌మ డిపార్ట్‌మెంట్ అధికారుల‌ను ఎవ‌రో ఓ వ్య‌క్తి వ‌రుస హ‌త్య‌లు చేస్తుంటే పోలీసులు ఏం చేశారు? అనే విష‌యాలు తెలియాలంటే జీ 5లో ఫిబ్ర‌వ‌రి 24న స్ట్రీమింగ్ కాబోతున్న‌ ‘పులి మేక’ ఒరిజిన‌ల్ చూడాల్సిందే.

ఇండియాలోనే వ‌న్ ఆఫ్ ది బెస్ట్ ఓటీటీల్లో ఒక‌టైన జీ 5 త‌మ ఆడియెన్స్ కోసం తెలుగు, త‌మిళ‌, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ‌, హిందీ, మ‌రాఠీ, గుజ‌రాతీ, బెంగాలీ స‌హా ఇత‌ర భాష‌ల్లో అప‌రిమిత‌మైన, కొత్త‌దైన, వైవిధ్య‌మైన కంటెంట్‌ను అందిస్తోంది. ఈ ఓటీటీ లైబ్ర‌రీలో ఫిబ్ర‌వ‌రి 24న‌ మ‌రో బెస్ట్ ఒరిజిన‌ల్‌గా జాయిన్ కావ‌టానికి సిద్ధ‌మ‌వుతుంది ‘పులి మేక’. ఈ ఒరిజిన‌ల్ కోసం జీ 5 కోన ఫిల్మ్ కార్పొరేష‌న్‌తో జాయిన్ అయ్యింది. లావ‌ణ్య త్రిపాఠి, ఆది సాయి కుమార్‌, సిరి హ‌న్మంత్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. త్వ‌ర‌లోనే జీ 5లో స్ట్రీమింగ్‌కి సిద్ధ‌మ‌వుతున్న ఈ స‌స్పెన్స్ థ్రిల్లింగ్‌ ఒరిజిన‌ల్ టీజ‌ర్‌ను శుక్ర‌వారం మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ రిలీజ్ చేసి టీమ్‌కి అభినంద‌న‌లు తెలిపారు.

‘పులి మేక’ టీజ‌ర్‌ను గ‌మ‌నిస్తే .. పోలీసుల‌ను మృగంలాంటి వేష‌ధార‌ణ‌తో ఉన్న వ్య‌క్తి వ‌రుసగా చంపేస్తుంటాడు. అస‌లు ఈ హ‌త్య‌ల‌ను ఎవ‌రు చేస్తున్నార‌నేది తెలియ‌క డిపార్ట్మెంట్ త‌ల‌లు ప‌ట్టుకుంటుంది. వెంట‌నే కేసుని సాల్వ్ చేయ‌టానికి, హంత‌కుడిని ప‌ట్టుకోవ‌టానికి పోలీస్ డిపార్ట్‌మెంట్ స్పెష‌ల్ ఇన్వెస్టిగేష‌న్ టీమ్‌ను ఏర్పాటు చేస్తుంది. దానికి హెడ్ కిర‌ణ్ ప్ర‌భ (లావ‌ణ్య త్రిపాఠి). అదే టీమ్‌లో ఫోరెన్సిక్ టీమ్ మెంబ‌ర్ ప్ర‌భాక‌ర్ శ‌ర్మ (ఆది సాయికుమార్) క‌నిపిస్తున్నారు. కేసుని సాల్వ్ చేయ‌టానికి పోలీసులు క‌ష్ట‌ప‌డుతుంటే మ‌రో వైపు మీడియా, పై అధికారుల నుంచి తెలియ‌ని ఒత్తిడి వారిపై ఉంటుంది. ఈ స‌న్నివేశాల‌ను చాలా ఇంట్రెస్టింగ్ వేలో టీజ‌ర్‌గా క‌ట్ చేశారు.

అస‌లు ఈ హంత‌కుడు ఎవ‌రు? ఎందుక‌లా పోలీసుల‌ను టార్గెట్ చేశాడనేది తెలియాలంటే ఫిబ్ర‌వ‌రి 24 వ‌ర‌కు ఆగాల్సిందే.

న‌టీన‌టులు:

కిర‌ణ్ ప్ర‌భ‌గా లావ‌ణ్య త్రిపాఠి, ప్ర‌భాక‌ర్ శ‌ర్మ‌గా ఆది సాయి కుమార్, అనురాగ్ నారాయ‌ణ్‌గా సుమన్‌, దివాక‌ర్ శ‌ర్మ‌గా గోప‌రాజు, రాజాగా క‌రుణాక‌ర్ శ‌ర్మ, సిరిగా ప‌ల్ల‌వి, శ్రీనివాస్‌గా పాండు రంగారావు, స్పంద‌న‌గా ప‌ల్ల‌వి శ్వేత న‌టిస్తున్నారు.

సాంకేతిక వ‌ర్గం:

బ్యాన‌ర్స్‌:  జీ 5, కోన ఫిల్మ్ కార్పొరేష‌న్‌
క‌న్విన్సిడ్, క్రియేటెడ్‌:  కోన వెంక‌ట్‌
ద‌ర్శ‌కుడు : చ‌క్ర‌వ‌ర్తి రెడ్డి.కె
సినిమాటోగ్ర‌ఫీ:  రామ్ కె.మ‌హేష్‌
ప్రొడ‌క్ష‌న్ డిజైన్‌:  బ్ర‌హ్మ క‌డ‌లి
ఎడిట‌ర్‌:  ఛోటా కె.ప్ర‌సాద్‌
స్టోరి రైట‌ర్స్‌:  కోన వెంక‌ట్‌, వెంక‌టేష్ కిలారు
కాస్ట్యూమ్స్‌:  నీర‌జ కోన‌
పాట‌లు:  శ్రీజో

Mega Power Star Ram Charan unveils thrilling Teaser for ZEE5 Original ‘Puli-Meka’
Lavanya Tripathi, Aadi Saikumar chase the mystery in this gripping thriller

Hyderabad, 17th February, 2023: ZEE5 has been relentlessly dishing out a wide variety of content in various formats in Telugu, Tamil, Kannada, Malayalam, Hindi, Marathi, Gujarati, Bengali and other languages. ZEE5 has made a name for itself nationwide as a prominent streaming platform since its inception. After presenting the comedy-drama ‘Oka Chinna Family Story’ from Pink Elephant Pictures, ‘Loser 2’ from Annapurna Studios stable, ‘Gaalivaana’ from BBC Studios and NorthStar Entertainment, ‘Recce’, ‘Hello World’, ‘Maa Neella Tank’, ‘Aha Naa Pellanta’ and most recently ‘ATM’, it is now ready with a new Original.

ZEE5 is now ready with ‘Puli-Meka’, whose tight thriller was today released digitally by Mega Power Star Ram Charan. A monster is on the loose in the city, killing one person after another. The mystery serial killer disguises as an animal and operates at night times. The police department is on the edge at a time when residents are frightened to the hilt. The tension is built effectively.

We see Lavanya Tripathi enter the screen in the role of a no-nonsense investigator who wants to solve the case at the earliest. Suman plays a top cop who gives the Special Investigation Time a limited time to crack the mystery. Aadi Saikumar plays an occasionally flirtatious and otherwise serious-minded forensic analyst who teams up with the SIT led by Lavanya’s character.

When the hunt begins, the web series seems to get racy. We have to wait till February 24 to enjoy the thrills!

Going by the teaser, talented writer Kona Venkat (who is also the creator of this series) has nailed it with impressive characterizations and situations laced with occasional humour. Astrology is an important ingredient in the story, something the teaser doesn’t reveal for now.

Director K Chakravarthy Reddy shows a thorough grasp of the craft.

Cast:

Lavanya Tripathi as Kiran Prabha
Aadi Saikumar as Prabhakar Sarma
Suman as Anurag Narayan
Goparaju as Diwakara Sarma
Raja as Karunakar Sarma
Siri Hanmanth as Pallavi
Srinivas as Panduranga Rao
Spandhana Palli as Swetha

Crew:

Banners: ZEE5, Kona Film Corporation
Conceived & Created by Kona Venkat
Director: Chakravarthy Reddy K
Cinematography: Ram K Mahesh
Production Design: Brahma Kadali
Editor: Chota K Prasad
Story Writers: Kona Venkat, Venkatesh Kilaru
Costume Designer: Neeraja Kona
Lyricist: SreeJo