బిగ్ బాస్ ఫేమ్ సయ్యద్ సోహైల్, మోక్ష హీరో హీరోయిన్లుగా నటిస్తోన్న చిత్రం ‘లక్కీ లక్ష్మణ్’. దత్తాత్రేయ మీడియా గ్యారంటీడ్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై ఎ.ఆర్.అభి దర్శకత్వంలో హరిత గోగినేని ఈ సినిమాను నిర్మిస్తున్నారు. డిసెంబర్ 30న సినిమా గ్రాండ్ రిలీజ్ అవుతుంది. ఈ సందర్బంగా శనివారం ‘లక్కీ లక్ష్మణ్’ ట్రైలర్‌ను విడుదల చేశారు. ట్రైలర్‌ను గమనిస్తే..దర్శకుడు ఎ.ఆర్.అభి సినిమాను ఎంటర్‌టైనింగ్‌గా మలిచినట్లు స్పష్టమవుతుంది. లైఫ్‌లో డబ్బులు సంపాదించాలనుకునే ఓ యువకుడు ఏం చేయాలని తెగ ఆలోచిస్తాడు. కోటీశ్వరుల కూతురుని ప్రేమించి పెళ్లి చేసుకుంటే లైఫ్ సెటిలైపోతుందని భావించి అమ్మాయిల వెంటపడతాడు. చివరకు ఓ అమ్మాయిని ప్రేమిస్తాడు. నిజంగా ఆ అమ్మాయి డబ్బున్న అమ్మాయేనా? ప్రేమించాలంటే డబ్బులు మాత్రమే ఉండాలా? అనే ఓ పాయింట్‌పై దర్శకుడు లక్కీ లక్ష్మణ్‌ను ఎంత ఆసక్తికరంగా తెరెక్కించాడనే తెలియాలంటే డిసెంబర్ 30న సినిమాను చూడాల్సిందే.
అయితే ట్రైలర్‌ను చూస్తుంటే చాలా ఎంటర్‌టైనింగ్‌గా, ఎమోషనల్‌గా సినిమా ఉంటుందని తెలుస్తుంది. ఇక సోహైల్ నటన ట్రైలర్‌లో సింప్లీ సూపర్బ్. ఇక సినిమా ఆసాంతం తను ఎలా నవ్విస్తాడు.. ఎలా ప్రేమలో పడేస్తాడనేది సినిమా చూడాల్సిందే.
నిర్మాత హరిత గోగినేని మాట్లాడుతూ ‘‘తల్లిదండ్రుల ప్రేమానురాగాలు.. అమ్మాయి ప్రేమ … ఏదీ తక్కువ కాదు. అలాంటి వాటి కంటే డబ్బు గొప్పదా అనే పాయింట్‌ను మా దర్శకుడు అభి లక్కీ లక్ష్మణ్ సినిమా రూపంలో అందంగా తెరకెక్కించారు. హీరో సోహైల్ తనదైన నటనతో అద్భతుంగా నటించారు. డిసెంబర్ 30న సినిమా చూస్తే మీరే చెబుతారు. మేం కూడా చాలా ఎగ్జయిట్‌మెంట్‌తో వెయిట్ చేస్తున్నాం. మంచి సినిమాను మీ ముందుకు తీసుకొస్తున్నామని నమ్మకంగా ఉన్నాం’’ అన్నారు.
హీరో సోహైల్ మాట్లాడుతూ ‘‘రీసెంటుగా రిలీజైన టీజర్‌కు సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు ట్రైలర్‌కు కూడా దాన్ని మించిన రేంజ్ రెస్పాన్స్ వస్తుంది. నేను పడ్డ కష్టానికి డిసెంబర్ 30న రిజల్ట్ వస్తుందని అనుకుంటున్నాను. లక్కీ లక్ష్మణ్ అందరినీ మెప్పించే సినిమా అవుతుంది’’ అన్నారు. .
దర్శకుడు ఎ.ఆర్.అభి మాట్లాడుతూ ‘‘టీజర్ చూసి అప్రిషియేట్ చేసిన ఆడియెన్స్ నుంచిట్రైలర్‌కి కూడా అమేజింగ్ రెస్పాన్స్ వస్తుంటే చాలా హ్యాపీగా ఉంది. లక్కీ లక్ష్మణ్ ఎంటర్‌టైన్మెంట్‌తో నవ్విస్తాడు.. మిమ్మల్ని ప్రేమలో పడేస్తాడు.. ఎమోషనల్‌గా మీ హృదయాలకు దగ్గరవుతాడు. సోహైల్ ఈ సినిమాతో మంచి హీరోగా ప్రూవ్ చేసుకుంటాడు’’ అన్నారు.
నటీనటులు:
సయ్యద్ సోహైల్, మోక్ష, దేవీ ప్రసాద్, రాజా రవీంద్ర, సమీర్, కాదంబరి కిరణ్, షాని తదితరులు
సాంకేతిక వర్గం:
బ్యానర్: దత్తాత్రేయ మీడియా గ్యారంటీడ్ ఎంటర్‌టైన్‌మెంట్, నిర్మాత: హరిత గోగినేని, కథ, మాటలు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: ఎ.ఆర్.అభి, మ్యూజిక్: అనూప్ రూబెన్స్, సినిమాటోగ్రఫీ: ఐ.అండ్రూ, ఎడిటర్: ప్రవీణ్ పూడి, పాటలు: భాస్కరభట్ల, కొరియోగ్రఫీ: విశాల్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: విజయానంద్ కీత, పి.ఆర్.ఒ: నాయుడు – ఫణి (బియాండ్ మీడియా).
Talented actor and Bigg Boss Telugu fame Sohel is playing a well-written character with a proper arc in ‘Lucky Lakshman’. The out-and-out family entertainer stars Mokksha as the female lead. Producer Haritha Gogineni and director AR Abhi are saying that the mix of entertainment and emotions is the film’s biggest USP.
Ahead of the film’s theatrical release on December 30, its trailer today gives us a peek into the movie. Sohel plays a middle-class youngster who wants to strike rich by impressing the daughter of some or the other millionaire in Hyderabad. He woos them, flirts with them, and marvels at the prospect of romancing with them. What happens when he eventually impresses a girl? Does she turn out to be a not-so-rich lady? What happens when he learns that love is not a money business but about compatibility between two individuals?
The trailer shows that Sohel’s performance is going to be enjoyable. He leads the show with fun and also does emotional scenes with ease.
Producer Haritha Gogineni today said that the film tries to show whether money is more important in our lives than the love of parents and a true soulmate. “When our movie is released on December 30, the audience will see for themselves how well Sohel has performed. We are excited to bring before the audience a very good film,” she added.
Hero Sohel said that the recently-released teaser has been a big hit. “And now, the trailer is also being embraced by the audience. I hope my efforts are going to have a pay-off in theatres. ‘Lucky Lakshman’ will surely entertain one and all,” he added.
Director AR Abhi said that he is extremely happy to see that the trailer has been received so well, much like the teaser. “Our film is going to leave you in splits. It’s going to immerse you in its emotions and content. Sohel is surely going to prove himself as a promising lead actor,” he added.
Cast:
Sohel, Mokksha, Devi Prasad, Raja Ravindra, Sameer, Kadambari Kiran, Shani Salmon, Sridevi Kumar, Ameen, Anurag, Master Roshan, Master Ayaan, Master Sameer, Master Karthikeya, Raccha Ravi, Jabardasth Karthik, Jabardasth Geethu Royal, Yadam Raju of ‘Royal Comedy Stars’ fame.
Crew:
Producer: Haritha Gogineni
Story – Screenplay – Dialogues – Direction: AR Abhi
Music Director: Anup Rubens
DOP: I Andrew
Editor: Prawin Pudi
Lyricist: Bhaskarabatla
Choreographer: Vishal
Executive Producer: Vijayanand Ketha
PRO: Naidu–Phani
Publicity Designer: Dhani Aelay
Marketing Partner: Akhilesh (Ticket Factory)
Casting Director: Over7 Productions