Rakshit Atluri: I wish Sasivadane to be a bigger hit than Palasa

0
179

ఏప్రిల్ 19న రిలీజ్ అవుతున్న ‘శశివదనే’ మూవీ ‘పలాస’ కంటే చాలా పెద్ద హిట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను – హీరో రక్షిత్ అట్లూరి

‘పలాస 1978’ ఫేం రక్షిత్ అట్లూరి, కోమలీ ప్రసాద్ హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘శశివదనే’. గౌరీ నాయుడు సమర్పణలో ఏజీ ఫిల్మ్ కంపెనీ,  ఎస్.వి.ఎస్.స్టూడియోస్ బ్యానర్స్‌పై అహితేజ బెల్లంకొండ, అభిలాష్ రెడ్డి గోడల నిర్మించారు.  గోదావరి నేపథ్యంలో లవ్ అండ్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాకు సాయి మోహన్ ఉబ్బర దర్శకత్వం వ‌హించారు. ఏప్రిల్ 19న సినిమా రిలీజ్ అవుతుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో…

కొరియోగ్రాఫర్ జెడి.మాస్టర్ మాట్లాడుతూ ‘‘ హీరో హీరోయిన్లుగా నటించిన రక్షిత్ అట్లూరి, కోమలీ ప్రసాద్‌లకు, ఈ సినిమాలో అవకాశం ఇచ్చిన నిర్మాతలు అహితేజ, అభిలాష్ గారికి, దర్శకుడు సాయి మోహన్ గారికి థాంక్స్. పాటలకు చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. టీమ్ అందరూ వర్క్ చేసిన బెస్ట్ ఔట్ పుట్ ఇచ్చారు. సినిమా అందరినీ నచ్చుతుంది.

ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ శ్రీపాల్ మాట్లాడుతూ ‘‘నిర్మాత అహితేజగారికి, గౌరిగారికి థాంక్స్. అభిలాష్, రక్షిత్, కోమలికి థాంక్స్. సపోర్ట్ చేసిన అందరికీ థాంక్స్’’ అన్నారు.

సినిమాటోగ్రాఫర్ శ్రీసాయి కుమార్ దారా మాట్లాడుతూ ‘‘రక్షిత్, కోమలి జంట స్క్రీన్ పై మెప్పిస్తుంది. సాయిమోహన్ గారితో నేను ఇంతకు ముందు షార్ట్ ఫిల్మ్ చేశాను. అది నచ్చటంతో నిర్మాతలు తేజ, అభిలాష్ గారు ఈ సినిమాకు సినిమాటోగ్రాఫర్ గా అవకాశం ఇచ్చారు. సినిమాను ఎంటైర్ టీమ్ ఎంతో కష్టపడి చేసింది. సినిమా పెద్ద సక్సెస్ కావాలని కోరుకుంటున్నా’’ అన్నారు.

చిత్ర సమర్పకురాలు గౌరీ నాయుడు మాట్లాడుతూ ‘‘రక్షిత్, కోమలీ, నిర్మాతలు అభిలాష్, అహితేజ సహా సపోర్ట్ చేసిన అందరికీ థాంక్స్’’ అన్నారు.

నిర్మాత అభిలాష్ రెడ్డి మాట్లాడుతూ ‘‘శశివదనే హీరో హీరోయిన్లుగా నటించిన రక్షిత్ అట్లూరి, కోమలి చక్కగా నటించారు. సాంగ్స్, టీజర్ అందరికీ నచ్చాయి. అలాగే సినిమాను కూడా పెద్ద హిట్ చేస్తారని నమ్ముతున్నాను’’ అన్నారు.

చిత్ర దర్శకుడు సాయి మోహన్ ఉబ్బర మాట్లాడుతూ ‘‘శశివదనే’ మా టీమ్ మూడేళ్ల ప్రయాణం. ఇప్పటి వరకు విడుదలైన టీజర్, మూడు పాటలకు ప్రేక్షకుల నంచి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. సినిమా టైటిల్, పాటలు ఎంతో సాప్ట్ గా అనిపిస్తున్నాయో సినిమా అంత హార్డ్ హిట్టింగ్ గా ఉంటుంది. మూవీ చూసిన తర్వాత ఓ ఆలోచనతో ఆడియెన్స్ బయటకు వస్తారు. ఈ డెబ్యూ డైరెక్టర్ కి ఇలాంటి సినిమా రావటం చాలా గొప్ప విషయం. నన్ను నమ్మిన గౌరి, అహితేజ, అభిలాష్‌గారికి థాంక్స్ అనే పదం చాలా చిన్నది. వారి మేలుని జీవితంలో ఎప్పటికీ మరచిపోలేను. సినిమాటోగ్రాఫర్ సాయికుమార్ ప్రతి సీన్ ను అద్బుతంగా తెరకెక్కించారు. శరవణ వాసుదేవన్ బ్యూటీఫుల్ మ్యూజిక్ తో పాటు అనుదీప్ దేవ్ ఎక్స్‌ట్రార్డినరీ బ్యాగ్రౌండ్ స్కోర్‌ను అందించారు. ఏప్రిల్ 19న మీ ముందుకు వస్తున్నాం. మీ ఆశీర్వాదం ఎప్పటికీ ఉంటుందని భావిస్తున్నాం’’ అన్నారు.

నిర్మాత అహితేజ బెల్లంకొండ మాట్లాడుతూ ‘‘అందరూ ఇచ్చిన సపోర్ట్ తో మార్కెట్ లో మా సినిమాకు ఓ మార్క్ వచ్చింది. ఏప్రిల్ 5న రిలీజ్ చేద్దాం అని అనుకున్నాం. కానీ ఫస్ట్ కాపీ చూసిన తర్వాత మా డిస్ట్రిబ్యూటర్స్ అందరూ సినిమాను ఏప్రిల్ 19న రిలీజ్ చేస్తే బావుంటుందని కోరారు. వారి కోరిక మేరకు ఏప్రిల్ 19న సినిమాను రిలీజ్ చేస్తున్నాం. సినిమాపై చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నాం. అనుదీప్ దేవ్ చాలా మంచి బ్యాగ్రౌండ్ స్కోర్ ఇచ్చారు. ఇలాంటి క్లైమాక్స్ తో సినిమా ఇప్పటి వరకు రాలేదని నేను చెప్పగలను. సినిమా చాలా ఎమోషనల్ గా ఉంటుంది. హీరో రక్షిత్, హీరోయిన్ కోమలిగారికి స్పెషల్ థాంక్స్. ఏ జర్నీలో వారెంతో సపోర్ట్ చేశారు. బ్యాక్ బోన్ లా సపోర్ట్ చేశారు. అభిలాష్ గారు నాపై నమ్మకంతో సపోర్ట్ చేశారు. ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ శ్రీపాల్ కి థాంక్స్. సాయిమోహన్ కి ఈ సినిమా చాలా మంచి డెబ్యూ అవుతుంది’’ అన్నారు.

హీరోయిన్ కోమలీ ప్రసాద్ మాట్లాడుతూ ‘‘హిట్ 2, మోడ్రన్ లవ్ ఇలా సిినిమాలు చేశాం కదా, మంచి కమర్షియల్ లవ్ స్టోరీ చేయాలని చాలా రోజుల నుంచి అనుకుంటూ వచ్చాను. ఆ సమయంలో సాయి మోహన్, నిర్మాతలు వచ్చారు. మంచి స్టోరీతో పాటు తొంబై దశకం స్టైల్లో ఉండే ఎమోషన్స్ ఉండే సినిమాలు చూసి చాలా కాలమైంది. అలాంటి కాన్సెప్ట్ తో తెరకెక్కిన చిత్రమే శశివదనే. సాయి మోహన్ గారు చెప్పినట్లు శశివదనే క్లైమాక్స్ గుర్తుండిపోతుంది. మీ మనసుల్లో వెంటాడుతుంది. మంచి మ్యూజిక్, సినిమాటోగ్రఫీ సహా అందరూ వంద శాతం కష్టపడ్డారు. మా నిర్మాతలు తేజ, అభిలాష్, గౌరిగారు మంచి లవ్ స్టోరి ఇవ్వాలని కష్టపడ్డారు. లైవ్ లొకేషన్స్ లోనే షూట్ చేశాం. అమలాపురం ప్రజలు ఎంతో బాగా చూసుకున్నారు. ఇక ఈ మూవీలో రాఘవ పాత్రలో నటించిన రక్షిత్ గురించి ఎంత చెప్పినా తక్కువే. రాఘవ లేకపోతే శశి లేదు.  ఏప్రిల్ 19న మా సినిమాను ఆశీర్వదిస్తారని నమ్ముతున్నాను’’ అన్నారు.

హీరో రక్షిత్ అట్లూరి మాట్లాడుతూ ‘‘శశివదనే చిత్రాన్ని ఏప్రిల్ 5 ని కాకుండా ఏప్రిల్ 19న విడుదల చేస్తున్నాం. ఎందుకు వాయిదా వేశామనేది మా దర్శకుడు చెప్పారు. సినిమా ఫస్ట్ కాపీ చూసుకుని కాన్ఫిడెంట్ గా ఉన్నాం. సినిమా చాలా బ్రహ్మాండంగా వచ్చింది. దర్శకుడు సాయి మోహన్ కథ చెప్పిన విధానం నాకు ముందు అర్థం కాలేదు. అప్పుడు నేను తనని నువ్వు పలాస సినిమా చూశావా అని అడిగాను. దానికి తను లేదు సార్ అన్నాడు. పలాస సినిమా చూడకుండా నేను ఈ సినిమాను ఎలా పెర్ఫామ్ చేయగలను అనుకున్నావ్ అని అడిగాను. రాత్రికి సినిమా చూసి మాట్లాడుతానని అన్నాడు. అలా జర్నీ ప్రారంభమైంది. హను రాఘవపూడిగారి దగ్గర సాయి వర్క్ చేశాడు. తను కూడా హనుగారంత పెద్ద డైరెక్టర్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అబ్బాయి, అమ్మాయి మధ్య ఉండే ఎమోషన్ తో పాటు తండ్రి ఎమోషన్‌ని సాయి ముందుగా రాసుకున్నాడు. పలాస కంటే శశివదనే పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నాను. అవుతుందని నమ్మకంగా ఉన్నాను. అలాగే డైరెక్టర్ రాసుకున్న కథను బ్రహ్మాండంగా మా సినిమాటోగ్రాఫర్ సాయికుమార్ దారి విజువలైజ్ చేసి, అద్భుతంగా చూపించారు. తను పెద్ద సినిమాటోగ్రాఫర్ అవుతాడు. శరవణన్ మంచి పాటలను ఇచ్చారు. అలాగే అనుదీప్ గారు బ్యాగ్రౌండ్ స్కోర్ ఇచ్చారు. జెడి మాస్టర్ క్యూట్ గా కొరియోగ్రఫీ చేశారు. రాఘవ అనే పాత్రలో నేను బాగా నటించటానికి కారణం శశి పాత్రలో అద్భుతంగా చేసిన కోమలిగారే. ఈ సినిమాలో నన్ను చూసినట్లు వేరే సినిమాలో కనిపించలేదు. క్లైమాక్స్ విషయానికి వస్తే.. నాది, కోమలిగారి పెర్ఫామెన్స్ చూస్తే మీరే గొప్పగా చెబుతాను. సినిమా ఆకట్టుకుంటుందనే నమ్మకంతో ఉన్నాం.  మా నిర్మాతలు తేజ, గౌరి, అభిలాష్ గారు చాలా కష్టపడ్డారు. ఏప్రిల్ 19న సినిమాను రిలీజ్ చేస్తున్నాం. అందరూ మా టీమ్‌ను ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను’’ అన్నారు.

నటీనటులు:

రక్షిత్ అట్లూరి, కోమలీ ప్రసాద్, శ్రీమాన్, దీపక్ ప్రిన్స్, జబర్దస్త్ బాబీ, రంగస్థలం మహేష్ తదితరులు

సాంకేతిక వర్గం:

సమర్పణ – గౌరీ నాయుడు, బ్యానర్స్ – ఏజీ ఫిల్మ్ కంపెనీ, ఎస్.వి.ఎస్.స్టూడియోస్, నిర్మాతలు – అహితేజ బెల్లంకొండ, అభిలాష్ రెడ్డి గోడల, రచన-దర్శకత్వం – సాయి మోహన్ ఉబ్బర, సినిమాటోగ్రాఫర్ – శ్రీసాయి కుమార్ దారా, సంగీతం – శరవణ వాసుదేవన్, బ్యాగ్రౌండ్ స్కోర్ – అనుదీప్ దేవ్, ఎడిటర్- గ్యారీ బి.హెచ్, కొరియోగ్రాఫర్ – జేడీ, సి.ఇ.ఒ – ఆశిష్ పేరి, పి.ఆర్.ఒ – సురేంద్ర నాయుడు – ఫణి కందుకూరి (బియాండ్ మీడియా).

Rakshit Attluri, Komalee’s ”Sasivadane” grand release on April 19

The eagerly awaited romantic entertainer, “Sasivadane,” starring the dynamic duo Rakshit Atluri and Komalee, is set to captivate audiences. Directed by the talented Saimohan Ubbana, this film promises a heartwarming and visually stunning cinematic experience. Produced by Ahiteja Bellamkonda, Abhilash Reddy Godala under AG Film Company, SVS Studios Pvt. Ltd,  “Sasivadane” has generated immense anticipation among fans and cinephiles alike.

Scheduled for a grand release on April 19, 2024, the film unit recently interacted with the media, expressing confidence in the film’s success. Choreographer J.D. Master expressed gratitude, stating, “Thanks to Rakshit Atluri and Komali Prasad, who played the hero and heroines, to the producers Ahiteja and Abhilash, and to the director Sai Mohan, for their invaluable contributions to this film.” He also noted the positive response to the songs and praised the entire team for their hard work, saying, “Everyone has worked tirelessly to deliver the best output, and we’re thrilled with the result.”

Executive producer Sripal extended thanks, stating, “I am grateful to producer Ahiteja and Gourigari, as well as to Abhilash, Rakshit, and Komali. I also want to thank everyone who supported us throughout this journey.”

Cinematographer Sreesai Kumar Dara praised the on-screen chemistry of Rakshit and Komali, highlighting their captivating performances. He shared his journey with the producers Teja and Abhilash, who offered them the opportunity to work as cinematographers for this film. He concluded by expressing his desire for the film to achieve great success.

Gauri Naidu, the film’s presenter, thanked everyone who supported Rakshit, Komali, and producers Abhilash and Ahiteja, acknowledging their invaluable contributions.

Producer Abhilash Reddy commended Rakshit Atluri and Komali for their exceptional performances as the film’s leads. He also expressed confidence in the film’s success, citing the positive reception of the songs and teaser.

Director Sai Mohan Ubbara reflected on the three-year journey of the team, noting the positive response to the teaser and songs released thus far. He described the film as a blend of soft titles and songs with a hard-hitting storyline, expressing gratitude to Gauri, Ahiteja, and Abhilash for their unwavering support. He praised the cinematography by Saikumar, the music by Saravana Vasudevan, and the background score by Anudeep Dev, concluding with an invitation for audiences to experience the film on April 19.

Producer Ahiteja Bellamkonda credited the film’s success to the collective support of everyone involved. He revealed that the film’s release was postponed to April 19 based on feedback from distributors, expressing confidence in the film’s emotional impact and praising the contributions of Rakshit and Komali.

Heroine Komali Prasad shared her excitement for portraying a commercial love story saying, “After ‘Hit 2’ and ‘Modern Love,’ I longed to do a good commercial love story. That’s when Sai Mohan and the producers approached me with this project. ‘Sasivadane’ has the kind of captivating story and emotions reminiscent of 90s films. As Sai Mohan mentioned, the climax will stay with you long after the credits roll. The music, cinematography, and everyone’s efforts are top-notch. Our producers worked hard to bring this beautiful love story to life. We shot in real locations and received incredible support from the people of Amalapuram. Rakshit’s portrayal of Raghava is integral to the film – there’s no Sasi without Raghava. We hope you’ll bless our film on April 19th.”

Hero Rakshit Atluri expressed confidence in the film’s success, praising the collaborative effort of the team. He shared insights into his character revealing “We’re excited to release ‘Sasivadane’ on April 19th. The film’s delay was explained by our director, and after seeing the first copy, we’re confident it was the right decision. The film is truly exceptional. Initially, I struggled to grasp director Sai Mohan’s vision for the story. I even asked him if he’d seen my previous film ‘Palasa,’ to which he replied no. I questioned how I could perform without him understanding my work, but he assured me he’d watch it and discuss further. That’s how our journey began. Sai previously worked with Hanu Raghavapudi and aspires to become a director of his caliber. He beautifully captured the emotions between the boy, girl, and even the father. I believe ‘Sasivadane’ will surpass the success of ‘Palasa.’ Our cinematographer Saikumar translated the director’s vision onto the screen brilliantly – he’s destined to become a great cinematographer. Saravanan’s music is fantastic, and Anudeep’s background score is phenomenal. J.D. Master’s choreography is delightful. My performance as Raghava was elevated by Komali’s exceptional portrayal of Sashi. I’ve never looked or felt this good on screen before. And when it comes to the climax, Komali’s performance truly steals the show. We’re confident the film will leave a lasting impression. Our producers Teja, Gauri, and Abhilash poured their hearts into this project. We hope you’ll support our team and watch ‘Sasivadane’ on April 19th.”

Movie: Sasivadane
Banner: AG Film Company, SVS studios
Presented by Gauri Naidu
Starring: Rakshit Atluri, Komalee, Sreeman, Deepak Prince, Jabardast Bobby, Rangasthalam Mahesh
Written & Directed by: SaiMohan Ubbana
Produced By: Ahiteja Bellamkonda , Abhilash Reddy Godala
Executive Producer: Sripal Cholleti
Music: Saravana Vasudevan
Background score: Anudeep Dev
Cinematography: Shrie SaiKumaar Daara
Editor: Garry BH
Choreographer – JD
Costume Designer: Gauri Naidu
Production By: AG Film Company
CEO: Ashish Peri
PRO: Naidu – Phani Kandukuri(Beyond Phani)
Marketing : Cross Clicks Marketing Agency