రికార్డ్ స్థాయిలో 20 ఓటిటి ప్లాట్ ఫాంలలో ఈ నెల 10 న స్ట్రీమింగ్ అవుతున్న “నాతి చరామి”
వై2కె సమస్య కారణంగా హైదరాబాద్‌లోని ఓ కుటుంబంలో జరిగిన వాస్తవ ఘటనల ఆధారంగా రూపొందించిన చిత్రం ‘నాతిచరామి’.నాగు గవర దర్శకత్వం వహిస్తున్నారు. అరవింద్ కృష్ణ, పూనమ్ కౌర్, సందేశ్ బురి ప్రధాన తారాగణంగా శ్రీ లక్ష్మీ ఎంటర్‌ప్రైజెస్ సమర్పణలో ఎ స్టూడియో 24 ఫ్రేమ్స్ ప్రొడక్షన్ పతాకంపై జై వైష్ణవి .కె నిర్మించారు. ఇంతకుముందు విడుదల చేసిన చిత్ర ట్రైలర్స్ కు ఆడియన్స్ నుండి సూపర్బ్ రెస్పాన్స్ వస్తోంది.అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని రికార్డ్ స్థాయిలో అమెజాన్, హంగామా,సోనీ,టాటా స్కై,ఎయిర్ టెల్ ఎక్స్ట్రీమ్, యమ్.ఎక్స్, ప్లేయర్ వంటి 20 ఓటిటి ప్లాట్ ఫాంలలో ఈ నెల 10 న స్ట్రీమింగ్ అవుతుంది.ఈ సందర్భంగా చిత్ర యూనిట్ పాత్రికేయులు సమావేశం ఏర్పాటు చేశారు.ఈ సందర్భంగా
నటి పూనమ్ కౌర్ మాట్లాడుతూ.. ఒక దుర్భరమైన పరిస్థితుల్లో ఉన్న ఏ స్త్రీ మీదైనా చిన్న కన్నేసినా వాడు రాక్షసుడే..కాలం ఏదైనా కథ ఇదే.. సీతాదేవి, ద్రౌపది, దుర్గా దేవి ల కథలు చదివాను. వీరంతా కూడా సమాజంలో చాలా ఫైట్ చేసి బిగ్ ఛాలెంజ్ ను ఎదుర్కొన్నారు. నేను చెన్నై లో ఉండగా దర్శకుడు నా దగ్గరకు వచ్చి ఈ కథ చెప్పడం జరిగింది.ఈ కథ నాకు చాలా బాగా నచ్చింది. అలాగే నా జీవితానికి గగ్గరగా ఉన్న కథ “నాతి చరామి”. 2007 లోనే పెళ్లి చేసుకొని అబ్రాడ్ కు వెళ్ళాలి అనుకున్నాను.కానీ సినిమానే నా జీవితం అయిపోయింది. చాలా మంది మద్య తరగతి నుండి వచ్చిన అమ్మాయిలకు చాలా కలలు ఉంటాయి. అవి అందరికీ నెరవేరవు. అయితే వారంతా వారి బలమేంటి ,బలహీనతలేంటి తెలుసుకొని ఎంతో మనో ధైర్యంతో స్ట్రెన్త్ తెచ్చుకొని ముందుకెళ్లాలి. అప్పుడే సక్సెస్ సాధిస్తారు. క్రైమ్ నేపథ్యంలో తీసిన ఫ్యామిలీ డ్రామా ఇది. భార్య భర్తల మధ్య భావోద్వేగాలు ఈ సినిమాలో చాలా బావుంటాయి.ఇలాంటి మంచి కథకు నన్ను సెలెక్ట్ చేసుకొన్న దర్శక, నిర్మాత లకు ధన్యవాదాలు. అన్ని వర్గాల ప్రేక్షకులకు ఈ సినిమా కచ్చితంగా నచ్చుతుంది అన్నారు.
ఈస్ట్ వెస్ట్ ఎంటర్ టైనర్ రాజీవ్ గారు మాట్లాడుతూ..ఈ సినిమా ఈ నెల 10 న అమెజాన్, హంగామా,సోనీ,టాటా స్కై,ఎయిర్ టెల్ ఎక్స్ట్రీమ్,యమ్.ఎక్స్,ప్లేయర్ వంటి 20 ఓటిటి ఛానెల్స్ లలో ఈ సినిమాను విడుదల చేస్తున్నాము. ఇందులో నటించిన వారందరూ చాలా చక్కగా నటించారు.దర్శక, నిర్మాతలు మా ఈస్ట్ వెస్ట్ ఇంటర్టైనర్ మీద నమ్మకం పెట్టుకొని ఎంతో ధైర్యంగా ఓటిటి లో విడుదల చేస్తున్నారు. ఇప్పుడున్న ట్రెండ్ కి సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలకు ఆడియన్స్ బాగా కనెక్ట్ అవుతున్నారు.ఇపుడు వస్తున్న ఈ సినిమా కూడా గొప్ప విజయం సాదించాలని అన్నారు.
చిత్ర దర్శకుడు నాగు గవర మాట్లాడుతూ ..ప్రపంచంలో ఉన్న స్త్రీ మూర్తులందరికీ శిరస్సు వచ్చి మహిళాదినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.అరవింద్ కృష్ణ, పూనమ్ కౌర్, సందేశ్ బురి… ముగ్గురి పాత్రల మధ్య జరిగే సంఘర్షణ ‘నాతిచరామి’. బలమైన సన్నివేశాలు, అర్థవంతమైన సంభాషణలు, అద్భుతమైన అభినయంతో సినిమా ఉంటుంది. 1999,2000 ప్రాంతంలో జరిగిన వాస్తవ ఘటనల ఆధారంగా, రూపొందించిన చిత్రమిది. ఇక్కడ జరిగిన క్రైమ్ కంటే దీని చుట్టూ జరిగిన డ్రామా నచ్చింది. ఈ కథకు సరైన యాక్టర్ ఉంటే ఈ కథను పవర్ ఫుల్ గా చెప్పచ్చు.అనిపించి శ్రీలత క్యారెక్టర్ ను డిజైన్ చేసుకొని ఈ కథకు పూనమ్ కౌర్ అయితే బాగుంటుందని తనకి ఈ కథ చెప్పడం జరిగింది..ఇంతవరకు తను చేయని రోల్ ఇది. ఇందులో తను చాలా హార్డ్ వర్క్ చేసింది. ఇందులో ఉన్న కంటెంట్ ప్రతి ఒక్కరికీ నచ్చుతుంది.సినిమా చూసి బయటికి వచ్చిన తరువాత కూడా శ్రీలత క్యారెక్టర్ మీ వెంట వస్తుంది..అలాగే ఈ సినిమాలో అరవింద్ ప్రభాకర్ కనిపించడానికి చాలా సెటిల్ద్ గా నటించాడు. ఈ సినిమా తరువాత తనకు మంచి పేరు తీసుకువస్తుంది. మార్చి 10 న ఓటిటి లో విడుదల అవుతున్న మా సినిమాను అందరూ ఆదరించి ఆశీర్వదించాలని అన్నారు.
నటుడు అరవింద్ కృష్ణ మాట్లాడుతూ..నా కెరీర్ లో “నాతిచరామి” వెరీ స్పెషల్ ఫిల్మ్ అవుతుంది.ఫ్యామిలీ ఆడియన్స్ కు దగ్గరయ్యే ఇలాంటి రోల్స్ చాలా తక్కువ వస్తాయి.నాతి చరామి అంటేనే ప్రామిస్..ఒక వైఫ్ & హుస్బెండ్ ఆ ప్రామిస్ ను అప్ హోల్డ్ చేయడానికి ఎంతదూరం వెళ్తారు. దానివల్ల వచ్చిన పరిణామాలేంటి అనేది ఈ సినిమాలో దర్శకుడు నాగు చాలా చక్కగా చెప్పాడు. నాగు గారు నా కెరియర్ బిగినింగ్ నుండి నాకు చాలా గైడెన్స్ ఇచ్చారు.ఈ సినిమా చూసిన వారందరూ కచ్చితంగా కనెక్ట్ అవుతారు.పూనమ్ గారు తన రోల్ కొరకు చాలా కష్టపడింది.ఈ సినిమాను 20 ఓటిటి ప్లాట్ ఫామ్ లలో ఈ నెల 10 విడుదల అవుతున్న ఈ సినిమా గొప్ప విజయం సాధించాలని అన్నారు.
నటుడు సందేశ్ బురి మాట్లాడుతూ.. ఇందులో నా పాత్రను నాగు గారు చాలా చక్కగా డిజైన్ చేశారు.నా జీవితంలో ఈ సినిమా ఒక మైల్ స్టోన్ గా నిలిచిపోతుంది.నాతో అరవింద్, పూనమ్ లు చాలా చక్కగా నటించారు.పాత్రలు తక్కువ ఉన్న అద్భుతమైన పెరఫార్మెన్స్ తో థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో ఈ సినిమా మిమ్మల్నందరినీ అలరిస్తుంది. “నాతి చరామి” అనే పదం ఎంతో శక్తి వంతమైన పదం. అది ఈ సినిమాకు కరెక్ట్ యాప్ట్. మధ్య తరగతి స్త్రీలకు చాలా ప్రోబ్లేమ్స్ వస్తుంటాయి. ఎమోషనల్, ఫిజికల్ , సైకాలజికల్, ఫైనాన్షియల్, స్పిరిచ్యువల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. వీటన్నింటి లో ఒక శత్రువు ఉంటాడు.ఆ శత్రువు రక రకాల రూపంలో మనిషి రూపంలో కావచ్చు, డబ్బు కావచ్చు ఇలా ఎదో ఒక ఆటంకం సృష్టిస్తోంది. మరి ఈ ఆటంకాలన్నిటిని ఎదుర్కొంటూ విలువలు కలిగిన కట్టుబాట్లు కలిగినటువంటి జీవితాన్ని సాధించడం చాలా కష్టమైన పని అలాంటి ప్రోబ్లేమ్స్ అన్నిటినీ ఇందులో చూయించడం జరిగింది. త్వరలో విడుదల అవుతున్న ఈ సినిమా గొప్ప విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను ఆన్నారు.
జయశ్రీ రాచకొండ మాట్లాడుతూ.. ఇది ఒక విమెన్ సెంట్రిక్ సినిమా. చాలా మంచి కంటెంట్ తో ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమా గొప్ప విజయం సాధించాలని ఆన్నారు.
ఇంకా ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారందరూ ఈ చిత్రం గొప్ప విజయం సాధించాలని అన్నారు.
నటీనటులు
అరవింద్ కృష్ణ, పూనమ్ కౌర్, సందేశ్ బురి, కవిత, మాధవి, జయశ్రీ రాచకొండ, కృష్ణ, సత్తన్న తదితరులు
సాంకేతిక నిపుణులు
పీఆర్వో: సురేంద్ర కుమార్ నాయుడు – ఫణి కందుకూరి (బియాండ్ మీడియా), ఎడిటర్: వినోద్ అద్వయ, లైన్ ప్రొడ్యూసర్: కె. మల్లిక్, సినిమాటోగ్రఫీ: మహి శేర్ల, స్టోరీ – స్క్రీన్ ప్లే – డైలాగ్స్: ఎ స్టూడియో 24 ఫ్రేమ్స్, ప్రొడ్యూసర్: జై వైష్ణవి .కె, స్క్రీన్ ప్లే – దర్శకత్వం: నాగు గవర
‘Nathicharami’ to release on a record-setting 20 OTT platforms on March 10
Arvind Krishna, Poonam Kaur and Sandesh Buri are the lead actors in Nagu Gavara-directed ‘Nathicharami’. Presented by Shrilaxmi Enterprises, the film is produced by A Studio 24 Frames’ Jai Vaishnavi K. The trailer for the movie was released recently and it has been garnering a superb response.
After completing all formalities, the film is slated to be released on 20 platforms on March 10. Amazon Prime Video, Hungama, Sony, Tata Sky, Airtel Xtreme, MX Player and others are the ones. Today, the team of the film interacted with the media to talk about their movie and the big release.
Actress Poonam Kaur said, “If a man casts his evil eye on a woman, he is a devil. The stories of Sita Devi, Draupadi and Durga Devi tell us the same. They were all fighters who faced massive challenges. Coming to ‘Nathicharami’, the director narrated the story to me when I was in Chennai. I liked the script because I could relate to its ingredients. It’s close to my life. In 2007, I wanted to get married and settle down abroad. But cinema became my life. Middle-class women come with a lot of dreams. But not everyone is lucky to realize them. Despite the setbacks, they should be undeterred. They must march ahead with a fighting spirit. ‘Nathicharami’ is a crime-based family drama. It taps into the emotions between a married couple. I thank the director and producers for selecting me. I am confident that all sections of audiences will like the movie.”
EastWest Entertainers Rajeev T said, “We are going to release the movie on March 10 on 20 OTT platforms. Everyone has given a superb performance. I thank the makers of ‘Nathicharami’ for reposing faith in EastWest Entertainers. These days, the viewers are lapping up suspense thrillers in a big way. I hope this film, too, becomes a big hit.”
Director Nagu Gavara started his address by wishing all women a Happy Women’s Day. He made a mention of the lead actors and praised their talents. “This is a film with strong situations, meaningful dialogues and amazing performances. Back at the turn of the century, the trend of many Indians migrating to the US for greener pastures started in a big way. Our movie is about what a family had to go through because of the Y2K crisis. This is a family drama with crime at its centre. The script is based on true incidents. With an able actor, you can empower any story. I could only think of Poonam Kaur when I wrote Sreelatha, the character. She has essayed a variety of roles in her career. She is a hard-working actress. Everyone is going to love the content of our movie. Poonam Kaur’s character will haunt you. Arvind Krishna has played a man named Prabhakar. His performance is subtle. This movie is going to bring him so much recognition. Please do watch ‘Nathicharami’ on March 10 on OTT platforms,” he added.
Actor Arvind Krishna said, “This is going to go down as a very special film in my career. It’s rare for you to get to play a character that can endear you to the family audience. The title means ‘promise’. It’s about a couple’s promise. Will they uphold the promise? What do they endure in the process? What consequences do they face? ‘Nathicharami’ is a pack of neatly-etched scenes. Nagu Gavara has guided me for long. The viewers will surely relate to the movie. Poonam Kaur has worked really hard.”
Actor Sandesh Buri said, “The director has etched my character neatly. ‘Nathicharami’ is going to be a milestone in my career. It was nice working with my co-stars Arvind and Poonam. The amazing performances and thrilling elements are going to arrest you. The title is powerful and is apt for the story. Middle-class women face a lot of problems, ranging from emotional, physical, psychological and situational. There is an enemy in all of these. The enemy could be a person, money or something else. It’s hard to stick to one’s principles in the face of adversity. Our film brings out these conflicts in human lives. We urge the viewers to please watch our film on OTT.”
Jayasri Rachakonda said, “This is a women-centric movie that is rich in content. We are confident about scoring a hit.”
Cast and crew:
Arvind Krishna, Poonam Kaur, Sandesh Buri, Kavitha, Madhavi, Jayasri Rachakonda, Krishna, and Sathanna have main roles.
PRO: Surendra Kumar Naidu-Phani Kandukuri (Beyond Media); Editor: Vinod Advay; Line Producer: K Mallik; Cinematographer: Mahi Sherla; Story, screenplay, dialogues: A Studios 24 Frames; Producer: Jai Vaishnavi K; Screenplay, direction: Nagu Gavara.