Manoj Bajpayee promotes his Blockbuster film, Sirf Ek Bandaa Kaafi Hai in Hyderabad!

0
173

Manoj Bajpayee promotes his Blockbuster film, Sirf Ek Bandaa Kaafi Hai in Hyderabad!

ZEE5, India’s largest home-grown OTT platform and multilingual storyteller recently premiered in Hindi the gripping courtroom drama ‘Sirf Ek Bandaa Kaafi Hai’ directed by Apoorv Singh Karki and starring Padma Shri and National Award recipient Manoj Bajpayee. The film has received raving reviews from media and audience alike and is on the top of the streaming charts with the fastest 400MN+ viewing minutes across all ZEE5 movies.

Produced by Vinod Bhanushali’s Bhanushali Studios Limited, Zee Studios and Suparn S Varma, ‘Sirf Ek Bandaa Kaafi Hai’ is inspired by true events. It is a courtroom drama starring Manoj Bajpayee in and as lawyer P.C Solanki. It is the story of an ordinary man – a high court lawyer who single-handedly fought an extraordinary case against the country’s biggest Godman and ended up prosecuting him for the rape of a minor under the POCSO act.

With the film’s release in Tamil and Telugu versions, the platform has reached out to a wider variety of Indian viewers. The film has witnessed an outstanding performance across languages becoming the first film to clock the fastest 400MN+ viewing minutes across all ZEE5 movies.

A screening of the film was held for the media fraternity in Hyderabad today which was graced by Manoj Bajpayee where he interacted with the media about the success of the film and the release in Tamil and Telugu languages.

Actor Manoj Bajpayee said, “Sirf Ek Bandaa kaafi Hai deals with an important social issue about the safety and security of women in our society. It is a reflection of our society and portrays the harsh reality. Since this film touches upon sensitive topics, it took us many years of hard work and research to bring this story to the viewers. And we are happy that the film has resonated with the audience and inspired them. It is a proud moment for us as we see the response to this film and the praise that it is getting from everyone. We recently released the film in Tamil and Telugu languages on ZEE5, and we are extremely happy that the audience in South has loved it too. Hope to continue seeing this positive response.

“~ ‘Sirf Ek Bandaa Kaafi Hai’ in NOW STREAMING in Hindi, Tamil and Telugu only on ZEE5 ~

‘సిర్ఫ్ ఏక్ బందా కాఫీ హై’ను ఇంత పెద్ద స‌క్సెస్ చేసిన ప్రేక్ష‌కుల‌కు థాంక్స్‌: మ‌నోజ్ బాజ్‌పాయి

ఉత్త‌రాదితో పాటు ద‌క్షిణాదిన కూడా విల‌క్ష‌ణ‌మైన పాత్ర‌ల‌తో త‌న‌దైన గుర్తింపు పొందిన న‌టుడు మ‌నోజ్ బాజ్‌పాయి ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన వెబ్ ఒరిజిన‌ల్ మూవీ ‘సిర్ఫ్ ఏక్ బందా కాఫీ హై’. ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ జీ స్టూడియోస్‌తో పాటు భ‌న్సాలి స్టూడియోస్ బ్యాన‌ర్స్‌పై వినోద్ భన్సాలి, క‌మ‌లేష్ భ‌న్సాలి, విశాల్ గుర్నాని, అసిఫ్ షేక్ ఈ చిత్రాన్ని నిర్మించారు. అపూర్వ సింగ్ క‌ర్కి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. హిందీలో బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించిన ఈ చిత్రం యూనిక్ కాన్సెప్ట్‌తో రూపొందటంతో దీన్ని జూన్ 7న తెలుగు, త‌మిళంలోనూ రిలీజ్ చేయ‌గా అమేజింగ్ ర‌స్పాన్స్ వ‌స్తోంది. ఈ సంద‌ర్భంగా సోమ‌వారం ఏర్పాటు చేసిన ప్రెస్‌మీట్‌లో విల‌క్ష‌ణ న‌టుడు మ‌నోజ్ బాజ్‌పాయి మాట్లాడుతూ ..‘సిర్ఫ్ ఏక్ బందా కాఫీ హై’ గురించి ప‌లు ఆస‌క్తిక‌ర‌మైన విష‌యాల‌ను తెలియ‌జేశారు..

* ‘సిర్ఫ్ ఏక్ బందా కాఫీ హై’ చిత్రం ఇంత పెద్ద స‌క్సెస్ అవుతుంద‌ని మేం ఎవ్వ‌రం ముందుగా ఊహించ‌లేదు. అయితే ఓ మంచి సినిమాను చేయాల‌ని మేం భావించాం. అందులో భాగంగా అంద‌రం ఎంతో క‌ష్ట‌ప‌డి సినిమా చేశాం. అలాగే ఆ దేవుడు ద‌య కూడా తోడు కావటంతో ఓ మంచి సినిమాను అందించామ‌ని భావిస్తున్నాను.

* ‘సిర్ఫ్ ఏక్ బందా కాఫీ హై’ చిత్రానికి ఆడియెన్స్ నుంచి అద్భుత‌మైన స్పంద‌న వ‌స్తుంది. కొంద‌రైతే రెండు, మూడు సార్లు చూస్తున్నారు. ముఖ్యంగా క్లైమాక్స్‌న‌యితే రిపీట్‌గా చూస్తున్నారు.

*మా డైరెక్ట‌ర్ అపూర్వ‌సింగ్ క‌ర్కి అయితే క్లైమాక్స్ చిత్రీక‌ర‌ణ కోస‌మైతే మూడు నాలుగు కెమెరాలు పెట్టారు. సింగిల్ టేక్‌లో ఏడు పేజీలున్న మోనోలాగ్‌ను కంప్లీట్ చేయాల‌ని నాతో అన్నారు. అందుకోసం నాకు రెండు రోజుల స‌మయం కూడా ఇచ్చారు. ఆయ‌న చెప్పిన‌ట్లుగానే సింగిల్ టేక్‌లో పూర్తి చేయాల‌నుకుని నేను వాటిని నేర్చుకుని రెండు రోజుల పాటు బాగా ప్రాక్టీస్ చేసి చేశాను. ఇప్పుడు చూస్తుంటే వ‌స్తున్న రెస్పాన్స్ చూసి చాలా ఆనందంగా ఉంది.

*ఈ చిత్రంలో నేను చేసిన సోలం అనే లాయ‌ర్ పాత్ర కామ‌న్ మ్యాన్‌కు ద‌గ్గ‌ర‌గా ఉంటుంది. అందుక‌నే ఆ పాత్ర అంద‌రికీ క‌నెక్ట్ అవుతుంది. ఎన్నో క‌ష్ట‌న‌ష్టాలున్నప్ప‌టికీ దాన్ని చిరున‌వ్వుతో ఎదుర్కొనే సాధార‌ణ మ‌ధ్య‌త‌ర‌గ‌తి ప్ర‌జ‌లంద‌రికీ ఈ పాత్ర ఓ ఉదాహ‌ర‌ణ‌.

* సోలంకి పాత్ర అంద‌రికీ క‌నెక్ట్ అవుతుంది. అందుక‌నే మంచి అప్రిషియేష‌న్స్ వ‌స్తున్నాయి. ‘సిర్ఫ్ ఏక్ బందా కాఫీ హై’ కాన్సెప్ట్‌ను మ‌న చుట్టూ జ‌రుగుతున్న ప‌లు నిజ ఘ‌ట‌న‌ల‌ల‌ను ఆధారంగా త‌యారు చేశాం. అయితే ప్ర‌ధానంగా ఈ సినిమా అంతా 16 ఏళ్ల అమ్మాయి చుట్టూనే తిరుగుతుంది. ఆమె త‌న జీవితంలో ఎదుర్కొన్న ఇబ్బందిక‌ర‌మైన ప‌రిస్థితులను చూపించాం. అలాగే ఆమెకు, సోలంకితో ఉన్న ఓ మంచి అనుబంధాన్ని చూపించే ప్ర‌య‌త్నం చేశాం.

* ఏ ప్రజాస్వామ్య వ్య‌వ‌స్థ‌కైనా న్యాయ వ్య‌వ‌స్థే మూల‌స్తంభంలాంటిది. అందుక‌నే ‘సిర్ఫ్ ఏక్ బందా కాఫీ హై’ చిత్రాన్ని లాయ‌ర్స్‌కి, న్యాయ వ్య‌వ‌స్థ‌కి అందించిన నివాళిగా భావిస్తున్నాం.

* సోలంకి పాత్ర‌లో న‌టించ‌టానికి చాలా హోం వ‌ర్క్ చేశాను. స్క్రిప్ట్ మొత్తం ప‌దే ప‌దే చ‌దివాను. ముఖ్యంగా లాయ‌ర్ రోల్ ఎలా ప్ర‌వ‌ర్తిస్తుంది.. మాట్లాడుతుంది ..ఇలా ప్ర‌తీ చిన్న విష‌యాన్ని క్షుణ్ణంగా ప‌రిశీలించాను. నాకు నేనుగా ఆ పాత్ర‌కు మ‌న‌సులో ఓ రూపంలో క్రియేట్ చేసుకుని దాన్ని ప్రొజెక్ట్ చేశాను

* హిందీలో అయితే ‘సిర్ఫ్ ఏక్ బందా కాఫీ హై’ ఓ హిస్ట‌రీ క్రియేట్ చేసింది. ఎందుకంటే ముందు ఓటీటీలో విడుద‌లైన త‌ర్వాత ప్రేక్షుల రిక్వెస్ట్ మేర‌కు సింగిల్ స్క్రీన్ థియేట‌ర్స్‌లో రిలీజ్ చేశారు. ఇప్పుడు తెలుగు స‌హా ఇత‌ర రీజ‌న‌ల్ లాంగ్వేజెస్‌లో రిలీజ్ చేశాం. దాన్ని అంద‌రూ చూసి ఆద‌రించాల‌ని కోరుకుంటున్నాను.

* జీ 5 వారు ‘సిర్ఫ్ ఏక్ బందా కాఫీ హై’ సినిమాను చూడ‌గానే న‌చ్చింది. అందుక‌నే వారు దాన్ని ఓటీటీలో వీలైనంత ఎక్కువ మందికి రీచ్ చేయించాల‌ని ప్ర‌య‌త్నించారు. అందులో భాగంగానే ఇప్పుడు తెలుగు, త‌మిళ‌ ప్రేక్ష‌కుల ముందుకు తీసుకొచ్చారు.

* ఇప్పటి వరకు మన సినిమాల్లో చాలా కోర్ట్ రూమ్ డ్రామాస్ వచ్చాయి. మా సినిమా విషయానికి వచ్చేసరికి మేం లార్జర్‌దేన్ లైఫ్‌గా చేయాల‌నుకోలేదు. ఉన్న‌ది ఉన్న‌ట్టుగా చూపించాల‌నుకున్నాం. దీన్ని ఒక క‌మ‌ర్షియ‌ల్ మూవీగా కూడా చేసి ఉండొచ్చు. కానీ.. మేం అలా చేయాల‌నుకోలేదు. ఓ ఎక్స్‌పెరిమెంట్‌లాగానే చేశాం. ఆ ప్ర‌య‌త్నం వ‌ల్ల‌నే బెస్ట్ కోర్ట్ రూమ్ డ్రామా మూవీగా అంద‌రూ చెబుతున్నారు.

* ‘సిర్ఫ్ ఏక్ బందా కాఫీ హై’ చిత్రంలో నేను కాకుండా మ‌రో తెలుగు న‌టుడు ఎవ‌రైతే బావుంటుంద‌ని ఆలోచిస్తే.. ఇప్ప‌టికే ప‌వ‌న్ క‌ళ్యాణ్ లాయ‌ర్‌గా చేసి మెప్పించారు. మ‌హేష్ బాబు అయితే ఈ పాత్ర‌కు సూట్ అవుతార‌నిపిస్తోంది.

* రీసెంట్‌గా నేను ఆర్ఆర్ఆర్ మూవీనే చూశాను. అది కాకుండా ఇండిపెండెంట్ మూవీస్ ఎక్కువ‌గా చూడ‌టానికి ఇష్ట‌ప‌డ‌తాను. చూస్తుంటాను కూడా. సినిమా షూటింగ్స్ లేన‌ప్పుడు పుస్త‌కాలు చ‌దువుతుంటాను. ఫ్యామిలీతో గ‌డుపుతుంటాను. హైద‌రాబాద్ వ‌చ్చిన‌ప్పుడు రాయ‌ల‌సీమ రుచులుకి వెళుతుంటాను. ఎందుకంటే నేను ఎక్కువ‌గా స్పైసీ ఫుడ్‌ను ఇష్ట‌ప‌డ‌తాను. అలాగే బిర్యానీని కూడా ఇష్టంగా తింటాను.