Dhoni Entertainment’s Family Entertainer LGM Is Gearing Up For Its Telugu Release

0
153

రిలీజ్‌కి సిద్ధ‌మ‌వుతోన్న ధోని ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యాన‌ర్ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్ ‘LGM’

జూన్ 15, హైద‌రాబాద్‌: ఇండియ‌న్ క్రికెట్ హిస్ట్రరీలో స‌క్సెస్‌ఫుల్ కెప్టెన్ మ‌హేంద్ర సింగ్ ధోని చిత్ర నిర్మాణ రంగంలోకి అడుగు పెట్టారు. ధోని ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యాన‌ర్‌పై LGM సినిమాను రూపొందిస్తున్నారు. త‌మిళంలో రూపొందుతోన్న ఈ చిత్రాన్ని తెలుగులోనూ విడుద‌ల చేస్తున్నారు. ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా తెర‌కెక్కుతోన్న ఈ చిత్రాన్ని ర‌మేష్ త‌మిళ్ మ‌ణి ద‌ర్శ‌క‌త్వంలో ధోని ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యాన‌ర్‌పై సాక్షి ధోని నిర్మిస్తున్నారు.

సినిమా చిత్రీక‌ర‌ణ‌ను పూర్తి చేసుకున్న ఈ మూవీ..పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసుకుంటోంది. త్వ‌ర‌లోనే ట్రైల‌ర్‌ను, ఆడియో విడుద‌ల చేయ‌టానికి సన్నాహాలు చేస్తున్నారు మేక‌ర్స్‌. ఈ కార్య‌క్ర‌మంలో మ‌హేంద్ర సింగ్ ధోని, సాక్షి ధోని పాల్గొన‌నున్నారు.

ఈ సంద‌ర్భంగా చిత్ర ద‌ర్శ‌కుడు ర‌మేష్ త‌మిళ్ మ‌ణి మాట్లాడుతూ ‘‘కుటుంబం అంతా కలిసి చూసే కామెడీ ఫ్యామిలీ డ్రామాగా LGM సినిమాను రూపొందిస్తున్నాం. సినిమా నవ్విస్తూనే ప్రేక్ష‌కుల గుండెల‌ను తాకుతుంది. LGM చిత్రానికి ప్రేక్ష‌కులు త‌మ ప్రేమ‌, ఆద‌ర‌ణ‌ను అందిస్తార‌ని భావిస్తున్నాం’’ అన్నారు.

ఇటీవ‌ల విడుదలైన LGM టీజర్ కు అద్భుత‌మైన స్పంద‌న వ‌చ్చింది. డిజిట‌ల్ ఫ్లాట్‌ఫామ్‌లో 7 మిలియ‌న్స్‌కు పైగా వ్యూస్‌ను ఇది సాధించింది.

ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందుతోన్న LGM చిత్రానికి ర‌మేష్ త‌మిళ్ మ‌ణి ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌టంతో పాటు మ్యూజిక్‌ను కూడా అందించారు. యోగి బాబు, మిర్చి విజ‌య్ త‌దిత‌రులు ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించారు.

Dhoni Entertainment’s Family Entertainer LGM Is Gearing Up For Its Telugu Release

Hyderabad – Successful Captain in Indian Cricket History, Mahendra Singh Dhoni has ventured into film production. As his maiden project, he is bank-rolling LGM under his Dhoni Entertainment banner. The film which is being made in the Tamil language, is also getting released in Telugu too. Billed to be a family entertainer, LGM is being directed by Ramesh Thamilmani while Sakshi Dhoni is producing it on Dhoni Entertainment banner.

The film has completed its shooting part. Currently it is undergoing it’s post-production work briskly and is nearing its completion. The film’s Audio and Trailer launch will be held soon in an event which will be graced by MS Dhoni and Sakshi Singh Dhoni.

Director Ramesh Thamilmani says, “Weaving humour and family elements together, LGM is a comedy-family drama which is a heartfelt journey that will make you smile and also touch your souls. We are grateful for all the love and support for LGM.”

The recently launched teaser of LGM garnered tremendous response and has clocked more than 7 million views in a short span across digital platforms.

Director Ramesh Thamilmani is composing music for this Family Entertainer, which features Harish Kalyan, Nadhiya, Ivana, Yogi Babu, Mirchi Vijay, and a slew of promising actors in the star cast.