Astonishing Poster Of Global Star Ram Charan, Sensational Director’s Biggie ‘Game Changer’ Conveying Dussehra Wishes Released… First Single On Diwali

0
130

దసరా సందర్భంగా గ్లోబ‌ల్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌, సెన్సేషనల్ డైరెక్ట‌ర్ శంక‌ర్ కాంబినేష‌న్ రూపొందుతోన్న భారీ బ‌డ్జెట్ మూవీ ‘గేమ్ ఛేంజర్’ నుంచి పోస్టర్ విడుదల.. 

దీపావళికి తొలి సాంగ్ రిలీజ్

గ్లోబ‌ల్‌ స్టార్ రామ్ చ‌ర‌ణ్ హీరోగా సెన్సేషనల్ డైరెక్ట‌ర్ శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న భారీ బ‌డ్జెట్ పాన్ ఇండియా చిత్రం ‘గేమ్ చేంజ‌ర్‌’. ఎన్నో సూప‌ర్ డూప‌ర్ బ్లాక్ బ‌స్ట‌ర్ చిత్రాల‌ను రూపొందించిన ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంక‌టేశ్వ‌ర సినీ క్రియేష‌న్స్ బ్యాన‌ర్ ఈ మూవీని నిర్మిస్తోంది. భారీ బ‌డ్జెట్‌తో నిర్మాత‌లు దిల్ రాజు, శిరీష్ అన్ కాంప్ర‌మైజ్డ్‌గా అంచ‌నాల‌కు ధీటుగా గేమ్ చేంజ‌ర్‌ను నిర్మిస్తున్నారు. RRR వంటి సెన్సేష‌న‌ల్ బ్లాక్ బ‌స్ట‌ర్ మూవీ త‌ర్వాత రామ్ చ‌ర‌ణ్ చేస్తోన్న సినిమా కావ‌టంతో గేమ్ ఛేంజ‌ర్‌పై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి.

సౌత్ ఇండియ‌న్ సినిమా రేంజ్‌ను నెక్ట్స్ లెవ‌ల్‌కి తీసుకెళ్లిన సెన్సేషనల్ డైరెక్ట‌ర్ శంక‌ర్ మేకింగ్ ఎలా ఉంటుందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఇప్ప‌టి వ‌ర‌కు ఆయ‌న తెర‌కెక్కించిన సినిమాల‌ను మించేలా ‘గేమ్ ఛేంజ‌ర్‌’ను ఆయ‌న రూపొందిస్తున్నారు. లార్జ‌ర్ దేన్ లైఫ్ క్యారెక్ట‌ర్‌తో చ‌ర‌ణ్‌ను ప్రెజెంట్ చేస్తున్నారు శంక‌ర్‌. ప్ర‌స్తుతం సినిమా షూటింగ్ శ‌ర‌వేగంగా పూర్త‌వుతుంది. ఈ నేప‌థ్యంలో ద‌స‌రా సంద‌ర్భంగా మేక‌ర్స్ ‘గేమ్ ఛేంజ‌ర్’ సినిమాకు సంబంధించి స‌రికొత్త పోస్ట‌ర్‌ను రిలీజ్ చేశారు. దీంతో పాటు మ‌రో అమేజింగ్ అప్‌డేట్‌ను అందించారు. దీపావ‌ళి సంద‌ర్బంగా ‘గేమ్ ఛేంజ‌ర్’ సినిమా నుంచి తొలి సాంగ్‌ను విడుద‌ల చేస్తున్నారు. మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌, సెన్సేషనల్ డైరెక్ట‌ర్ శంక‌ర్‌ల‌తో పాటు మ్యూజిక్ సెన్సేష‌న్ ఎస్‌.ఎస్‌.త‌మ‌న్ క‌లిసి తొలిసారి వ‌ర్క్ చేస్తున్న గేమ్ ఛేంజ‌ర్ సినిమా నుంచి పాట‌ను పాన్ ఇండియా రేంజ్‌లో దీపావళికి గ్రాండ్ లెవ‌ల్లో రిలీజ్ చేయ‌టానికి స‌న్నాహాలు చేస్తున్నామ‌ని చిత్ర యూనిట్ తెలియ‌జేసింది.

న‌టీ న‌టులు:
రామ్ చ‌ర‌ణ్‌, కియారా అద్వానీ, అంజ‌లి, సముద్ర‌ఖ‌ని, ఎస్‌.జె.సూర్య‌, శ్రీకాంత్‌, సునీల్‌, న‌వీన్ చంద్ర త‌దిత‌రులు

సాంకేతిక వ‌ర్గం:

ద‌ర్శ‌క‌త్వం:  శంక‌ర్, నిర్మాత‌లు:  దిల్ రాజు & శిరీష్‌, రైట‌ర్స్‌:  ఎస్‌.యు.వెంక‌టేశ‌న్‌, ఫ‌ర్హ‌ద్ సామ్‌జీ & వివేక్‌, స్టోరీ లైన్‌:  కార్తీక్ సుబ్బ‌రాజ్‌, కో ప్రొడ్యూస‌ర్‌:  హ‌ర్షిత్‌, సినిమాటోగ్ర‌ఫీ:  ఎస్‌.తిరుణావుక్క‌ర‌సు, మ్యూజిక్‌:  త‌మ‌న్.ఎస్‌, డైలాగ్స్‌:  సాయిమాధ‌వ్ బుర్రా, లైన్ ప్రొడ్యూస‌ర్స్‌:  ఎస్‌.కె.జ‌బీర్‌ & న‌ర‌సింహారావ్‌.ఎన్‌, ఆర్ట్ డైరెక్ట‌ర్‌:  అవినాష్ కొల్ల‌,  యాక్ష‌న్ కొరియోగ్రాఫ‌ర్‌:  అన్బ‌రివు, డాన్స్ కొరియోగ్రాఫ‌ర్స్‌:  ప్ర‌భుదేవా, గ‌ణేష్ ఆచార్య‌, ప్రేమ్ ర‌క్షిత్‌, బాస్క‌క్ష మార్టియా, జానీ & శాండీ, లిరిసిస్ట్‌:  రామ‌జోగ‌య్య శాస్త్రి, అనంత శ్రీరామ్‌ & కాస‌ర్ల శ్యామ్‌, ఎడిట‌ర్‌:  షామీర్ ముహ్మ‌ద్, సౌండ్ డిజ‌న‌ర్‌:  టి.ఉద‌య్‌కుమార్‌

Astonishing Poster Of Global Star Ram Charan, Sensational Director’s Biggie ‘Game Changer’ Conveying Dussehra Wishes Released… First Single On Diwali

All eyes are on Global Star Ram Charan’s next biggie ‘Game Changer’ directed by sensational director Shankar as a pan India affair. Renowned Production house which has delivered numerous blockbusters Sri Venkateswara Creations banner is bank-rolling this mega budgeted film. Producers Dil Raju and Sirish are mounting ‘Game Changer’ in an uncompromised manner that will surely surpass everyone’s expectations. As Ram Charan is arriving with ‘Game Changer’ after a global phenomenon ‘RRR’, the film is surrounded with massive hype and carrying huge expectations.

Shankar is popular for his lavish making and at the same time portrays emotions blending with a social message. He has taken the South Indian Cinema to a whole new level with his films. He is determined to deliver his finest with ‘Game Changer’ and is presenting Charan in a larger than life character. The film’s shoot is going at a rapid pace. Meanwhile, on the occasion of Dussehra, Makers unveiled the brand new poster of ‘Game Changer’ conveying Vijaya Dasami wishes. Along with the poster, makers also revealed the most awaited update regarding the film, that they will be releasing the First Single from the film on Diwali. Music Sensation SS Thaman is working for the first time with Director Shankar. The film unit announced that the trio, Mega Power Star Ram Charan, Sensational Director Shankar and Music Sensation Thaman are coming together for the first time for ‘Game Changer’ and the first song will be released at a Pan India level on Diwali.

Cast:

Ram Charan, Kiara Advani, Anjali, Samuthirakani, SJ Suryah, Sreekanth, Sunil, Naveen Chandra and Others

Crew:

Director: Shankar, Producers: Dil Raju, Sirish, Writers: SU Venkatesan, Farhad Samji & Vivek, Story Line: Karthik Subbaraj, Co-Producer: Harshith, Cinematography: Thirunavukkarusu, Music: Thaman.S, Dialogues: Sai Madhav Burra, Line Producers: SK Jabeer & Narasimha Rao N, Art Director: Avinash Kolla, Action Choreography: Anbariv, Dance Choreographers: Prabhudeva, Ganesh Acharya, Prem Rakshit, Bosco Martin, Jaani & Sandy, Lyricist: Ramajogayya Sastry, Anantha Sriram & Kasarla Shyam, Editor: Shameer Mohamad, Sound Designer: T Udaykumar