‘Prem Kumar’ Can Be Watched And Enjoyed With Entire Family – Director Abhishek Maharshi

0
195

కుటుంబ సమేతంగా చూడదగ్గ చిత్రమిది.. ‘ప్రేమ్ కుమార్’ దర్శకుడు అభిషేక్ మహర్షి

సంతోష్ శోభ‌న్ హీరో రాశీ సింగ్, రుచిత సాదినేని హీరోయిన్లుగా నటించిన తాజా చిత్రం ‘ప్రేమ్ కుమార్’. సారంగ ఎంటర్‌టైన్‌మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై శివ ప్రసాద్ పన్నీరు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. రైట‌ర్‌ అభిషేక్ మహర్షి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ల‌వ్ అండ్ ఎంట‌ర్‌టైనింగ్ ఎలిమెంట్స్‌తో తెర‌కెక్కిన ఈ సినిమా ఆగ‌స్ట్ 18న‌ రిలీజ్ అవుతోంది. ఈ సందర్భంగా దర్శకుడు అభిషేక్ మహర్షి మీడియాతో ముచ్చటించారు. ఆయన చెప్పిన సంగతులివే..

*మీ నేపథ్యం ఏంటి? ఈ సినిమా కథ ఎలా ప్రారంభమైంది?*

సినిమాలకు ఘోస్ట్ రైటర్‌గా పని చేశాను. ఓటీటీలో షోలకి కూడా రాశాను. పేపర్ బాయ్ అయిపోయిన టైంలోనే సంతోష్ శోభన్‌ను కలిశాను.. ఓ షార్ట్ ఫిల్మ్ చేద్దామని అనుకున్నాం. అలా చివరకు సినిమాను చేశాం. నా దగ్గర ఉన్న ముప్పై కథల్లోంచి ఓ కథను ఎంచుకున్నాం. చివరకు ప్రేమ్ కుమార్ కథ సెట్ అయింది. నా కామెడీ టైమింగ్‌ను సంతోష్, శివ బాగా నమ్మేవారు.

*ఇది వరకు మీరు ఎవరి దగ్గరైనా అసిస్టెంట్‌గా పని చేశారా?*
కరోనా వల్ల ఈ సినిమా కాస్త ఆలస్యమైంది. ఈ మూవీ పాయింట్ కొత్తగా ఉంటుంది. నేను ఇది వరకు ఎవరి దగ్గరా అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేయలేదు. కానీ నేను చాలా ప్రొడక్షన్ కంపెనీల్లో రైటర్‌గా పని చేశాను. నా యాక్టింగ్ కెరీర్ కూడా ఈ సినిమాకు బాగా కలిసి వచ్చింది.

*ఏ దర్శకుడి ప్రభావం మీ మీద ఎక్కువగా ఉంది?*
హను రాఘవపూడి, సుకుమార్, వంశీ పైడిపల్లి, త్రివిక్రమ్, నగేష్ కుకునూర్ ఇలా అందరూ ఎంతో పర్ఫెక్ట్‌గా సినిమాను ప్లాన్ చేసి తీస్తారు. ఒక్కొక్కరిది ఒక్కో స్టైల్ ఉంటుంది. నేను నటుడిగా వాళ్లతో ఇంటరాక్ట్ అయినప్పుడు ఎన్నో విషయాలు తెలుసుకున్నాను. ఆ అనుభవాలన్నీ ఈ సినిమాకు ఉపయోగపడ్డాయి.

*విశ్వక్ సేన్ నటించిన సినిమాతో పోలిక పెడుతున్నారు కదా?*
సినిమాల్లో పెళ్లి సీన్‌లో చివర్లో హీరో వచ్చి.. హీరోయిన్‌ పెళ్లి ఆపుతాడు. హీరో హీరోయిన్లు కలిసిపోతారు. కానీ ఆ పెళ్లి కొడుకు గురించి ఎవ్వరూ ఆలోచించరు. వాడికి కూడా ఓ జీవితం ఉంటుంది. అది చెప్పేందుకే ఈ ప్రేమ్ కుమార్ సినిమాను తీశాం. విశ్వక్ సేన్ అశోకవనంలో అర్జున కళ్యాణం సినిమా టీజర్ చూసినప్పుడు కాస్త భయపడ్డాను. ఇదేంటి నా కాన్సెప్ట్ లాగా ఉందే అని అనుకున్నాను. కానీ ఆ  మూవీ దర్శకుడితో మాట్లాడాక.. కాన్సెప్ట్ వేరని అర్థమైంది.

*స్క్రిప్ట్ పూర్తయ్యాక ఏమైనా మార్పులు జరిగాయా?*
మా టీంలో క్రియేటివ్ డిఫరెన్సెస్ ఏమీ రాలేదు. స్క్రిప్ట్ లాక్ అయ్యాక అందులో ఎవ్వరూ ఏమీ వేలు పెట్టలేదు. సంతోష్ ఒక్కసారి సినిమా ఒప్పుకుంటే, స్క్రిప్ట్ ఓకే చేస్తే.. డైరెక్టర్ ఏం చేయమంటే అదే చేస్తాడు. ఒకసారి స్క్రిప్ట్ లాక్ అయిన తరువాత ఎలాంటి మార్పులు చేయలేదు.

*మీ మ్యూజిక్ డైరెక్టర్ గురించి చెప్పండి?*
మ్యూజిక్ డైరెక్ట‌ర్ అనంత్ శ్రీక‌ర్ చదువుకునే రోజుల నుంచి నాకు తెలుసు. శ్రీచరణ్ పాకాల దగ్గర అసిస్టెంట్‌గా పని చేశాడు. కామెడీ జానర్ ఆయనకు కొత్త. ఈ సినిమాకు ఫ్యూజన్ స్టైల్లో మ్యూజిక్ కొట్టాడు. ఆర్ఆర్ కూడా అద్భుతంగా వచ్చింది. థియేటర్లో సౌండింగ్ పరంగా కొత్త ఫీలింగ్ వస్తుంది.

*ఈ కథ, ఈ టైటిల్ ఎలా పుట్టింది?*
కుచ్ కుచ్ హోతా హై, నువ్వే నువ్వే లాంటి సినిమాలు చూసి ఇన్ స్పైర్ అయి ఈ కథను రాశాను. మగాడికి పెళ్లి అయితే జీవితం నాశనం అవుతుంది. పీఠల మీదే పెళ్లి ఎలా ఆగిపోతుందని చాలా రకాలుగా ఆలోచించి రాశాను.. బయట కూడా అలాంటి ఘటనలే జరిగాయి.

*నిర్మాత శివ ప్రసాద్ గురించి చెప్పండి?*
సినిమాల మీద మా నిర్మాత శివ ప్రసాద్‌కి ఎంతో ప్యాషన్ ఉంది. ఊరికే ఏదో సినిమా తీసేద్దామని అనుకోలేదు. సంతోష్, నేను, శివ ముగ్గరం కూడా ఎక్కడో ప్రారంభించి ఇక్కడి వరకు రావడమే సక్సెస్‌గా భావిస్తాం.

*మీ తదుపరి చిత్రాల గురించి చెప్పండి?*
కుటుంబ సమేతంగా చూడదగ్గ చిత్రమిది. ఎక్కడా వల్గారిటీ, బూతులు ఉండవు. అమ్మానాన్నలతో కలిసి ఈ సినిమాను హాయిగా చూడొచ్చు. ఆద్యంతం వినోదభరితంగా ఉంటుంది. ఇందులో నా భార్య, నేను కూడా గెస్ట్ రోల్స్‌‌లో కనిపిస్తాం. నెక్ట్స్ ఫుల్ లెంగ్త్ సీరియస్ సబ్జెక్ట్ చేయాలని అనుకుంటున్నాను. స్టోరీ రెడీగా ఉంది. సెప్టెంబర్ కల్లా స్క్రిప్ట్ రెడీ అవుతుంది.

‘Prem Kumar’ Can Be Watched And Enjoyed With Entire Family – Director Abhishek Maharshi

Santosh Soban starrer latest film ‘Prem Kumar’ co-starring Raasi Singh, Ruchitha Sadineni is Produced under Saranga Entertainments Pvt Ltd by Shiva Prasad Panneeru. Writer Abhishek Maharshi is making his directorial debut. The film which is made with love and entertaining elements is getting ready to release on August 18th. On this occasion, Direction Abhishek Maharshi interacted with the media about the film. Here’s the transcript of the interview.

What is your background? How did this film begin?

– I worked as a ghostwriter for films. I wrote for shows in OTT. I met Santosh Soban after he completed his first film Paper Boy. We both wanted to do a short film. Finally, we came here today to make a full-length feature film. We selected a story out of thirty stories I have written. That’s how the ‘Prem Kumar’ story got finalized. Santosh and Shiva both believed in my comedy timing.

Have you worked as an assistant to any writer or director?

– This film got delayed due to COVID. This film is based on a very new point. I didn’t work as an assistant to anyone. But, I worked as a writer for many production houses. My acting career also helped me while directing this film.

Which director’s influence did you have while making this film?

– Hanu Raghavapudi, Sukumar, Vamshi Paidipally, Trivikram, Nagesh Kukunoor… all of these make films with perfect planning. Each one of them has their style. When I interacted with them as an actor, I learned a lot of things from them. Those experiences came in handy for this film.

What do you say about the comments comparing your film with Vishwak Sen’s film?

– Hero comes in during the climax scenes and stops the heroine’s marriage in films. Hero and Heroines unite at the end. No one thinks about that bridegroom who was supposed to get married to the heroine. He also has a life. We tried to narrate this point through ‘Prem Kumar’. I was a bit worried when I watched Vishwak Sen starrer Ashoka Vanamlo Arjuna Kalyanam’s teaser. It was similar to my concept. But, I came to know it was a different concept after speaking to the director.

Any changes after the formation of the script?

– We don’t have any creative differences in our team. After we locked the script, no one tried to correct it. Santosh once agrees to do a film and okayed the script, he does whatever the director asks him to do. We didn’t make any changes after the script got finalized.

Tell us about your music director.

– I know music director Anant Srikar since his studying days. He worked for Sri Charan Pakala. The comedy genre is new to him. He gave music in a fusion style. Re-recording came out superbly. You will experience new sounds in the theatres.

How did the story and title emerge?

– I got inspired by the films Kuch Kuch Hota Hai, and Nuvve Nuvve and wrote this story. A man’s life gets destroyed after marriage. What happens if his marriage gets canceled at the last minute… I thought about several points and wrote this story. Even I saw some incidents in real life too.

Tell us about Producer Shiva Prasad.

– Our Shiva Prasad is passionate about films. He didn’t want to Produce films for just namesake. Santosh, Shiva and I believe coming here from scratch is a success.

About your future projects?

– ‘Prem Kumar’ can be watched with the entire family. It doesn’t have any vulgarity or cuss words. We can watch this film and enjoy it with our parents. The film goes entertainingly throughout. Me and my wife also did guest roles in the film. I want to make a completely serious film. The story is also completed. The entire script will be ready by September.