Korameenu will be released in theatres on December 31

0
152
ఆనంద్ రవి హీరోగా నటిస్తోన్న ‘కొరమీను’ సినిమా నుంచి మెలోడీ సాంగ్ ‘మీనాచ్చి మీనాచ్చి..’  రిలీజ్
 

ప్రేమ‌కు పేద‌, ధ‌నిక అనే బేదం ఉండ‌దు. మ‌న‌సుకు న‌చ్చిన వారు క‌న‌ప‌డితే చాలు వెంట‌నే ప్రేమ పుడుతుంది. మనసులో ప్రేమ పుట్టటం కాదు.. ఆ ప్రేమ‌ను నిచ్చెలికి అందంగా చెప్ప‌ట‌మూ ఓ క‌ళ. మీనాక్షిని చూడ‌గానే ఆ యువ‌కుడికి హృద‌యం ల‌య త‌ప్పింది. ఇంకేముంది…

‘‘మీనాచ్చి మీనాచ్చి నిన్నే చూడ‌గా.. ఓ.. ఓ
మ‌న‌సిచ్చి మ‌న‌సిచ్చి న‌చ్చా నిన్నుగా.. ఓ ..ఓ
క‌ల‌గా వ‌చ్చేశావు క‌ళ్ల‌కెదురుగా
అల‌వై లాగావు నన్ను పూర్తిగా .. ’’అంటూ  అందంగా పాట రూపంలో మీనాక్షిని త‌న ప్రేమ‌ను చెప్పేశాడా యువ‌కుడు. ఇంత‌కీ క‌థానాయ‌కుడు ఎవ‌రు? అత‌ని హృద‌యాన్ని దోచుకున్న మీనాక్షి ఎవ‌రు? అనే విష‌యం తెలుసుకోవాలంటే ఆనంద్ ర‌వి హీరోగా న‌టిస్తోన్న  ‘కొరమీను’ సినిమా చూడాల్సిందే. మ్యాంగో మాస్ మీడియా సమర్పణలో ఫుల్ బాటిల్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై పెళ్లకూరు సమన్య రెడ్డి నిర్మిస్తున్నఈ సినిమా డిసెంబ‌ర్ 31న గ్రాండ్‌గా రిలీజ్‌కు సిద్ధ‌మ‌వుతుంది. స్టోరీ ఆఫ్ ఇగోస్ అనేది కాప్షన్. శ్రీపతి కర్రి దర్శకత్వం వహిస్తున్నారు. జాలరిపేట అనే మత్స్యకారుల కాలనీకి కొత్తగా వచ్చిన పోలీస్ మీసాల రాజు మీసాలు ఎవరు తీసేశారనేది ఆసక్తికరమైన అంశంతో మడిపడిన  మూవీ ఇది. ఓ డ్రైవర్, అహంకారంతో కూడిన, బాగా డబున్న అతని యజమాని, వైజాగ్‌లో శక్తివంతమైన పోలీసు … ఈ మూడు క్యారెక్టర్స్ మధ్య నడిచే చిత్రమే ‘కొరమీను’.

రొటీన్‌కి భిన్నంగా ‘‘మీసాలు రాజుకు మీసాలు ఎందుకు తీసేశారు’’ అనే కాన్సెప్ట్‌తో సినిమా ప్ర‌మోష‌న్స్‌ను షురూ చేశారు. దీంతో అంద‌రిలోనూ మీసాల రాజు మీసాల క‌థ‌ను తెలుసుకోవాలనే ఎగ్జ‌యిట్‌మెంట్ పెరిగింది. అక్క‌డి నుంచి డిఫ‌రెంట్ ప్ర‌మోష‌న‌ల్ ప్లానింగ్‌తో కొర‌మీను సినిమా అంద‌రి దృష్టిని ఆకర్షిస్తోంది. రీసెంట్‌గా ఈ సినిమా నుంచి ‘తెలిసింది లే..’ అనే పాటను విడుదల చేయగా సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు ‘మీనాచ్చి మీనాచ్చి’ అనే మెలోడి సాంగ్‌ను చిత్ర యూనిట్ గురువారం రోజున విడుద‌ల చేసింది. పూర్ణాచారి రాసిన ఈ పాట‌ను సూర‌జ్ సంతోష్ స‌హ‌జ సిద్ధంగా పాడిన తీరు అందరినీ ఆక‌ట్టుకుంటోంది. అనంత్ నారాయ‌ణ‌న్ ఎ.జి ఈ చిత్రానికి సంగీత సార‌థ్యం వ‌హిస్తున్నారు. ఆనంద్ రవికి జోడిగా కిషోరి ధాత్రక్ జంటగా నటించింది.

 ‘కొరమీను’ చిత్రాన్ని  గంగ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై మ‌హేశ్వ‌ర్ రెడ్డి  తెలుగు రాష్ట్రాల్లో డిసెంబ‌ర్ 31న  గ్రాండ్‌గా రిలీజ్  చేయ‌టానికి సన్నాహాలు చేస్తున్నారు. అలాగే పాటలు మ్యాంగో మ్యూజిక్ ద్వారా రిలీజ్ అవుతున్నాయి.

న‌టీన‌టులు:
……………………….
కోటి పాత్రలో ఆనంద్ రవి, కరుణగా హరీష్ ఉత్తమన్, మీసాల రాజు పాత్రలో శత్రు, మీనాక్షిగా కిషోరీ దత్రక్, దేవుడు పాత్రలో రాజా రవీంద్ర, సీఐ కృష్ణ పాత్రలో గిరిధర్, ముత్యంగా ‘జబర్దస్త్’ ఇమ్మాన్యుయెల్, సుజాతగా ఇందు కుసుమ, వీరభద్రమ్ పాత్రలో ప్రసన్న కుమార్, కరుణ అసిస్టెంట్ పాత్రలో ఆర్కే నాయుడు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.

సాంకేతిక వ‌ర్గం:
………………………………

ఈ చిత్రానికి పీఆర్వో : నాయుడు సురేంద్ర కుమార్ – ఫణి కందుకూరి బియాండ్ మీడియా, స్టైలిష్: పూజ శేఖర్, ఎడిటర్: విజయ్ వర్ధన్ కె, పాటలు: అనంత నారాయణన్ ఏజీ, ప్రొడక్షన్స్ డిజైనర్: ముసి ఫణి తేజ, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: పవన్ కుమార్ జన స్వామి, సినిమాటోగ్రాఫర్: కార్తీక్ కొప్పెర, సౌండ్ డిజైన్: సాయి వర్మ ముదునూరి, బ్యాక్ గ్రౌండ్ స్కోర్: సిద్ధార్థ్ సదాశివుని, ప్రొడక్షన్ హౌస్: ఫుల్ బాటిల్ ఎంటర్టైన్మెంట్స్, మాంగో మీడియా సమర్పణ , డిస్ట్రిబ్యూషన్ : గంగ ఎంటర్టైన్మెంట్స్ , ఆడియో : మాంగో మ్యూజిక్ ,  స్టోరీ – స్క్రీన్ ప్లే – డైలాగ్స్ : ఆనంద్ రవి, డైరెక్టర్: శ్రీపతి కర్రి, నిర్మాత : పెళ్లకూరు సమన్య రెడ్డి.

‘Meenacchi Meenacchi’ is a melody from ‘Korameenu’

‘Korameenu’ will be released in theatres on December 31

‘Korameenu’, a raw and rustic film set in the backdrop of Jalaripeta, stars Anand Ravi, Harish Uthaman and Shatru in key roles. The film’s teaser was released recently.

Today, a melody titled ‘Meenacchi Meenacchi’ was released. It’s about the poetic expression that a guy’s feelings take when he wants to convey his fervent emotions to his lover. Love knows no class differences. A poor person and a rich person can fall in love for eternity. The present melody conveys such a sharp reality.

‘‘మీనాచ్చి మీనాచ్చి నిన్నే చూడ‌గా.. ఓ.. ఓ
మ‌న‌సిచ్చి మ‌న‌సిచ్చి న‌చ్చా నిన్నుగా.. ఓ ..ఓ
క‌ల‌గా వ‌చ్చేశావు క‌ళ్ల‌కెదురుగా
అల‌వై లాగావు నన్ను పూర్తిగా .. ’’

Its initial lines, penned by Purnachary, say it all. The pleasant composition by Anantha Narayanan AG is also made special by Sooraj Santhosh’s vocals.

‘Korameenu’ is a gripping tale involving three major characters: a powerful cop, a driver and his wealthy boss. The premise is that of the cop’s moustache getting removed by a mystery character.

Director Sripathy Karri’s film is going to come out in theatres on December 31.

The film has been promoted creatively. Curiosity has been raised by talking about the plot point of Meesala Raju’s moustache being removed. Who did the daring act? Besides an exciting promo, the film’s first song ‘Thelisindi Ley’ has also been a hit with the audience.

The film is going to be released in the Telugu States by Maheshwar Reddy on Ganga Entertainments. The songs are being released on Mango Music.

Cast:

Anand Ravi as Koti
Harish Uthaman as Karuna
Shatru as Meesala Raju
Kishori Dhatrak as Meenakshi
Raja Raveendra as Devudu
Giridhar as CI Krishna
Jabardasth Emmanuel as Muthyam
Indu Kusuma as Sujatha
Prasanna Kumar as Veerabhadram
RK Naidu as Karuna’s assistant

Crew:

Director: Sripathy Karri
Producer: Pellakuru Samanya Reddy
Production House: Full Bottle Entertainments
Presents: Mango Mass Media
Story, screenplay, dialogues: Anand Ravi
Cinematographer: Kartheek Koppera
Music: Anantha Narayanan AG
Audio: Mango Music
Background Score: Sidharth Sadasivuni
Editor: Vijay Vardhan K
Production Designer: Musi Phani Teja
Stylist: Pooja Shekar
Executive Producer: Pavan Kumar Jana Swami
Sound Design: Sai Varma Udunuri
Lyrics: Purnachary, Lakshmi Priyanka
Singers: Master Vasudev AS, Sooraj Santhosh, Parvathy AG, Nithin Raj
PRO: Naidu-Phani (Beyond Media)